Sunday, November 17, 2024

ఎడిటోరియ‌ల్ – క‌ర్నాట‌క‌లో కానుక‌లు వ‌ర్షం…

కర్నాటక అసెంబ్లి ఎన్నికల నగారా మోగింది. మే 10వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. మే13వతేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఫలితాల కోసం దేశమం తా ఎదురు చూస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికల ను రిహార్సిల్స్‌గా పరిగణిస్తున్నారు. కర్నాటకలో ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. బీజేపీ విజయం సాధించేందుకు శాయశక్తులను ఒడ్డుతోంది. అందుకే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌ షా ఇప్పటికి పలుమార్లు పర్యటించి వాగ్దానాల వర్షం కురిపి స్తున్నారు. కాంగ్రెస్‌ కూడా బీజేపీకి ఏమీ తీసిపోన ట్లుగా నిరుద్యోగ పట్టభద్రులకు మూడువేల భృతి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డికె శివ కుమార్‌ ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలను కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో సన్నిహితంగా ఉంటూ అభ్యర్ధుల ఎంపిక పై అవగాహన కుదుర్చుకున్నారు.

శివకుమార్‌ కళాకారు ల ర్యాలీలో ఐదువందల రూపాయిల నోట్ల వర్షాన్ని కురి పించారు. అలాగే, బీజేపీ తానేమీ తక్కువ కానన్నట్టు ప్రజలకు భారీగా తాయిలాలను ప్రకటిస్తోంది.ఈ రెండు పార్టీలు ఎన్నికల పోలింగ్‌కి చాలా ముందే కానుకలను కురిపిస్తున్నాయి.కేంద్రంలో అధికారంలో ఉంది కనుక, కాంగ్రెస్‌ కన్నా, ఎక్కువ ఖరీదైన కానుకలను ప్రకటిస్తోం ది. అయితే,రాష్ట్రంలో 40 శాతం పైగా ఉన్న ఒక్కళిగ, లింగాయత్‌ సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు రెండు పార్టీ ల్లోనూ ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మయి లింగాయ త్‌ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా,డికె శివ కుమార్‌, జనతాదళ్‌ (ఎస్‌) అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి ఒక్కళిగ సామాజిక వర్గానికి చెందిన వారు. వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని సీఈసీ తొలిసారి కల్పిస్తున్నది. ఈ నిర్ణ యంతో 12.15 లక్షల మంది వృద్ధులు,5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.21 కోట్ల మంది కాగా, వారిలో వందేళ్ళు పైబడిన వారు 16,976 మంది ఉన్నారు. శతాధిక వయసు గల వారు కర్నాటకలోనే ఎక్కువ మం ది ఉన్నారు. అందుకే, వృద్దులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని తొలిసారిగా కర్నాటకలోనే కల్పించారు.

కర్నాటకలో సామాజికవర్గాల ప్రభావమే కాకుండా ధనప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్ధి కోట్లలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.అలా ఖర్చు చేయగలిగిన వారికే ఈ రెండు పార్టీలు టికెట్లు ఇస్తున్నా యి. కాంగ్రెస్‌, బీజేపీలతో పోలిస్తే జనతాదళ్‌(ఎస్‌) అంత ఎక్కువగా ఖర్చు చేసే పరిస్థితి లేదు.అయితే, సామాజిక వర్గాల పరంగా ఒక్కళిగల మద్దతు జనతాదళ్‌ (ఎస్‌) కి ఉంది.రాష్ట్రంలో రాజకీయాలను శాసించే మఠాధిపతు ల ప్రాబల్యం,పలుకుబడి రాష్ట్రంలో ప్రధానంగా చెలా మణి అవుతూండేది. ఇటీవల శివసాయుజ్యం చేరిన శివ గంగ పీఠాధిపతి ఆశీస్సులతో జనతాదళ్‌ (ఎస్‌) ఎన్నిక ల్లో విజయాలను సాధిస్తూ వచ్చింది.ఇప్పుడు ఆయన అనుచరులు ఎటువైపు ఉన్నారో ఇదమిత్థంగా తెలియ దు.

అదేసందర్భంలో బీజేపీలో సీనియర్‌ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్‌ సామాజిక వర్గ నాయకుడు యెడియూరప్పకూ, పీసీసీ అధ్యక్షుడు శివ కుమార్‌కీ మఠాధిపతులలో మంచి పలుకుబడి ఉంది. మఠాధిపతులు ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకోవడం కర్నాటకలోనే ఉంది. అంతేకాకుండా వారు ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నందున ఆ సంస్థల్లో పని చేసే వారందరి మద్దతు ఆయా పార్టీలకు లభిస్తుంది.డబ్బుకి లెక్క లేకుండా అభ్యర్ధులు ఖర్చు చేయడంలో పోటాపోటీ గా వ్యవహరిస్తుంటారు. అందుకే, గెలుపొందిన తర్వాత అంతకు అంత సంపాదించడానికి అడ్డదారులు తొక్కు తుంటారు, మంత్రుల స్థాయిలో రాజకీయ నాయకులే పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ శాఖల కాంట్రాక్టర్ల నుంచి ఒక్కొక్క పనికి 25 శాతం కమిషన్‌ను తీసుకుంటుంటా రు. కమిషన్‌ ఇవ్వకపోతే బిల్లులు ఆపించేస్తారు.

దీంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడులకు లోనైన ఇద్దరు కాంట్రాక్టర్లు ఇటీవ ల ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ శాసనసభ్యుడు ఒకరు ఇటీవల వేలాది రూపాయిల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా రాష్ట్రం లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. అవినీతి మాదిరిగానే పార్టీ ఫిరాయింపులు కర్నాటకలో సర్వసాధారణం. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు చివరివరకూ అదే పార్టీలో కొనసాగకపోవడం కర్నాటకలో సర్వసాధార ణం. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఫిరాయింపుదారులు ఎంతో మంది ఉన్నారు. ఆపరేషన్‌ ఆకర్ష కార్యక్రమం కర్నాటకలోనే బీజేపీ ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement