వేసవి కాలం ప్రవేశిస్తున్న రోజుల్లో వర్షాలు పడటం ప్రకృతి వైపరీత్యమే. ఇది రైతులకు అలవాటే. వానొచ్చి నా, వరదొచ్చినా నష్టపోయేది వారే. అతివృష్టి, అనా వృష్టి, అకాల వర్షాలు, వడగండ్ల వానలు…ఇవన్నీ ప్రకృ తి వైపరీత్యాలుగా ప్రతిసారీ రైతులకు శాపంగా పరిణమి స్తున్నాయి. వీటి వల్ల ఎక్కువగా నష్టపోతున్న రైతులను ఆదుకోవడం పాలకుల తక్షణ కర్తవ్యం. మిగిలిన సమ యాల్లో రాజకీయాల గురించి మాట్లాడుకున్నా, రైతు కన్నీరు తుడవడానికి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కృషి చేసినప్పుడే అది ఆదర్శ సమాజం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా సంవత్సరాదికి ముందు అకాల వర్షాలు, వడగండ్లవానలు రైతుల వెన్ను విరిచాయి. తెలుగు సంవత్సరాదికి కొత్త పంటలతో రైతు ల ముంగిళ్ళు కళకళలాడేవి. ఈ ఏడాది అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో, వడగండ్లు తెలంగాణలో ముంచెత్తా యి. తెలంగాణలో వడగండ్ల వానలు సహజమే కానీ, ఈ ఏడాది ఎక్కువగా పడ్డాయి. రోడ్ల మీద వడగండ్లు పర్చు కోవడంతో వాహన దారులు చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు.
వ్యవసా యానికి తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరిగాయి. పెట్టు బడి సాయంగా ప్రభుత్వాలు అందిస్తున్న సాయం అంతంత మాత్రమే. పేరు ఏదైనా పంట చేతికి వచ్చే సరికి ఎకరానికి 50వేల రూపాయిలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. మిర్చి సాగుకు ఎకరానికిక రెండు లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టారు. వర్షపు నీటిలో మిర్చి కొట్టుకుని పోయిన పొలాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లాలో బోనకల్లు తదితర ప్రాంతాల్లో వడ గండ్ల వాన వల్ల దెబ్బతిన్న పొలాలను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తాజాగా పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులను, విలేజ్ డెవలెప్‌మెంట్ అధికారులను వెంటబెట్టుకుని నీళ్ళ మడుగుల్లో ఉన్న పంటను పరిశీ లించారు. రైతులకు గుండెకోతను మిగిల్చిన వడగండ్ల వాన బాధితులకు ఎకరానికి పదివేల రూపాయిల సాయాన్నికేసీఆర్ అక్కడికక్కడే ప్రకటించారు. పంటల బీమా పథకం, రైతుసమ్మాన్ వంటి ఎన్నో పథకాలను కేంద్రం ప్రకటించినప్పటికీ అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి.. పైగా కేంద్రం నుంచి సాయం అందడా నికి చాలా ప్రక్రియ అమలు జరగాలి. కేంద్ర అధికార బృందం పర్యటన, ఆ బృందం సిఫార్సులను పరిశీలించి కేంద్రం సాయాన్ని ప్రకటించడానికి కేంద్రం నుంచి రైతు లకు సాయం అందేసరికి మరో తుపాను వస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు అనుభవమే. కేంద్రం హామీలు నీటి మీద రాతలే. అందుకే, కేంద్ర సాయం కోసం వేచి ఉండ కుండా రైతులకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సాయం ప్రక టించినట్టు కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో వ్యవసాయా భివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సా హకాలు, సాయమే కారణం. వరిని పండించే రాష్ట్రాల్లో తెలంగాణను అతి స్వల్ప కాలంలోనే అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్.మాటల్లో కాదు.చేతల్లో చేసి చూపిస్తున్నారు.ఆయన కొత్తగా ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి (భారాస) కొత్త నినాదం రైతుల గురించే. ఆప్‌కా బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఉత్తరాది రాష్ట్రాల రైతులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లిలో రైతులు నిరవధికంగా సాగించిన ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఆ కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ,సమాజ్ వాదీ పార్టీ వంటి ఉత్తరాది పార్టీలు కేసీఆర్ తో చేతులు కలిపాయి. ఉత్తరాదిన రైతులఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు సాయం అందజేశారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకోవడమే కాదు, అందుకు తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నారు రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు జేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు అనుకరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి
.ఆంధ్ర్ర ప్రదేశ్‌లో మామిడి,అరటి తోటలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది మామిడి కాపు బాగా తక్కువని రైతులు ఆందో ళన చెందుతున్న తరుణంలో అకాల వర్షాలు వారిని మరింత నష్టపర్చాయి.మినప పైరు పూర్తిగా తడిసి పోయి పొలంలోనే మొక్కలు రావడంతో రైతుల ఆందోళ న అధికమైంది. తెలంగాణలో మాదిరి తమకు పరిహారా న్ని ఇప్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది అకాల వర్షాల వల్ల రైతులు ఉగాది వేడుకలను జరుపుకోలేకపోయారు. ఉత్సాహం సన్నగిల్లడంతో రైతులు ఎటువంటి ఉగాది ఉత్సవాలు జరుపుకోలేదు. నీట మునిగిన పైర్లను దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకో వాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా రు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు తక్షణ సాయంగా ఎకరానికి పదివేల ప్రకటించడం అభినందనీయమే. అయితే ఇది ఏ మాత్రం చాలదని రైతు సంఘాలు అంటున్నాయి.