ఢిల్లి లెప్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వీకే సక్సేనా, ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య నడుస్తున్న ప్రచ్ఛ న్నయుద్ధం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. ఇంతవరకూ వీరిద్దరి మధ్య కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంది. ఇప్పుడు కొత్తగా ఢిల్లి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్‌పర్సన్ నియామకం విష యంలో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇద్దరూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ప్రధాన న్యాయమూర్తి ఈ విషయమై ఇరువురికీ సముచితమైన సలహా ఇచ్చారు. పాలనా రంగంలో ఇలాంటి అభిప్రా యభేదాలు సహజమనీ, కలిసి కూర్చుని చర్చించుకుంటే అవి తొలగి పోతాయని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఢిల్లిdలో ప్రభుత్వ అధికారులను నియమించడం, బదిలీ చేయడం అంశంపై అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై ఇప్పటికే కేజ్రీవాల్ కేంద్రంతో పోరాటం సాగిస్తున్నారు. ఈ విషయంలో అన్ని పార్టీ ల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. మొన్నటివరకు తన వైఖరి ఏమిటో తేల్చని కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ ఆర్డినెన్స్‌ను వ్యతి రకిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో బెంగళూరులో జరు గుతున్న ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు కేజ్రీవాల్ సమ్మతి తెలిపారు.
రాష్ట్రాల్లో గవర్నర్లకూ, ముఖ్యమంత్రులకూ పడకపోవడం అనేది ఢిల్లిdకే పరి మితం కాలేదు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమి ళనాడు, తదితర రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా సైలెంట్ వార్ సాగుతోంది. అయితే, ఆ రాష్ట్రాల్లో ఢిల్లిd మాదిరిగా కోర్టు దాకా వెళ్ళలేదు. గతంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకీ, అప్పటి ముఖ్యమంత్రి నారాయణ స్వామికీ ఇదే మాదిరి విభేదాలుండేవి. కేంద్రం జోక్యం చేసుకుని సర్దుబాటు చేసింది. ఎక్కడైనా, అభిప్రాయ భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం అనేది ప్రజా స్వామ్య సంప్రదాయం. ఢిల్లిdలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుపై తలెత్తిన అభిప్రాయ భేదాలపై దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు చేపట్టింది .
లెఫ్టినెంట్ గవర్నర్ తరఫున సాల్వే, ఢిల్లి ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కీ, ఇప్పుడు ఈ తాజా వి వాదానికీ సంబంధం లేదు. ఢిల్లి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అం శం గతంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్లకూ, రాష్ట్ర ప్రభు త్వాలకూ వివాదానికి కేంద్ర బిందువు అయింది. అప్పు డు కూడా కేంద్రం జోక్యం చేసుకుని సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది. రాష్ట్రాల్లో గవర్నర్లు, రాజ్యాంగ ప్రతినిధులు. వారు రాష్ట్రపతి ఆదేశాలకు లోబడి పనిచేయాలి. కానీ, ఇంతకు ముందు యూపీఏ హ యాంలోనూ, ఇప్పుడూ కేంద్రం ఆదేశా లకు అనుగుణంగా పని చేస్తున్నారన్న ఆరోపణలకు గురి అవుతున్నారు. రాష్ట్రాల్లో పరిస్థితిపై గవర్నర్లు ఎప్పటి కప్పుడు కేంద్రానికి నివేదికలు పంపుతూ ఉంటారు. వాటి ఆధారంగా రాష్ట్రాలను కేంద్రం ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
గవర్నర్‌లు కేంద్రం గుప్పిట్లో పాచికలుగా మారారని నాలుగు దశాబ్దాల క్రితమే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావు ఆరోపించారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలనే వరకూ వెళ్ళారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా, ముఖ్య మంత్రులు, గవర్నర్ల మధ్య సామరస్యం కొరవడు తున్నం దువల్లనే ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకుం టున్నాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీఏ హయాంలోనూ గవర్నర్‌తో ఘర్షణ జరిగింది. ఢిల్లిdలో పోలీసు శాఖను రాష్ట్ర ప్రభు త్వం అధీనంలో ఉంచాలని ఆయన మొదటి నుంచి వాదిస్తున్నారు. అయితే, ఢిల్లి దేశ రాజధాని కావడం వల్ల కేంద్ర హోం శాఖ ఢిల్లి లో శాంతిభద్రతలను పర్య వేక్షిస్తోంది.
ఢిల్లిలో ఏ ఘటన జరిగినా అది కేంద్రం వైఫల్యంగానే కేజ్రీవాల్ ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కోరలను పూర్తిగా పీకేస్తుందని కేజ్రీవాల్ వాదన. కేజ్రీవాల్ కేంద్రంతో మొదటి నుంచి ఘర్షణాత్మక వైఖరిని అనుస రిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వంతో ఘర్షణకు కారణం కూడా అదే. అయితే, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు ఉన్న అధికారాల పరిధిలోనే ఢిల్లిలో జోక్యం చేసుకుంటున్నట్టు కేంద్ర నాయకులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సమస్యపై ఈనెల 20వ తేదీనాటికి కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేంద్రమైనా, ఢిల్లి ప్రభుత్వమైనా సుప్రీంకోర్టు ఆదేశాలకు అను గుణంగా పని చేయాల్సిందే.