Wednesday, November 20, 2024

ఎడిటోరియ‌ల్ – త‌మిళ పెరుగుకి హిందీ దెబ్బ‌….

పెరుగు వివాదం తమిళనాడును కుదిపేసింది. చివర కు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ దిగి వచ్చి పెరుగు ప్యాకెట్ల పె దహీ అనే పేరును తొలగించేందుకు అంగీకరించింది. దహీ అనేది హిందీ పదం. తమిళనాడు లో హిందీ సినిమాలు చూస్తారు కానీ, హిందీ పదాల వాడకాన్ని సహించరు. హిందీ అంటే ఉత్తరాది వారి భాష అనీ, ఆ భాష ప్రాచుర్యంలోకి వస్తే ఉత్తరాదివారి ప్రాబ ల్యం పెరిగిపోతుందని తమిళుల అపోహ.అయితే,దక్షిణ భారత హిందీ మహాసభ ప్రధాన కార్యాలయం చెన్నై లోనే ఉంది.1918లో మహాత్మాగాంధీహయాంలోనే ఈ సంస్థ స్థాపించబడింది.ఈ మహాసభ నిర్వాహకులంతా తమిళులే. కానీ, హిందీ భాషను తమిళులు వ్యతిరేకించి నట్టు మరి ఎవరూ వ్యతిరేకించకపోవడం గమనార్హం. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే పరీక్షలకు తమిళులు, తెలుగువారు, మలయాళీలు, కన్నడిగులు హాజరవుతూ ఉంటారు. హిందీని రాజభాషగా ప్రకటిం చి ఉత్తర,దక్షిణ ప్రాంతాల వారు సంఘటితంగా ఉండేట్టు చర్యలు తీసుకోవాలన్నది మహాత్మాగాంధీ ఆకాంక్ష. అయితే, గ్రామస్వరాజ్యం వంటి మహాత్ముని ఆశయాల ను ఆయన వారసులు చాప చుట్టినట్టే హిందీ ప్రచారం కూడ నోచ ుకోకుండా చేశారు. తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోఉన్నా హిందీని వ్యతిరేకిస్తూ వస్తోంది. హిందీని వ్యతిరేకించకపోతే అక్కడ ఓట్లు పడవు. తమిళ నాడు మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న కర్డ్‌, తమిళంలో ఉన్న తయిర్‌ పేర్లను తొలగించి దహీ అని ముద్రించాలని ఆదేశించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా తమిళ అభిమానులు ఆందోళన ప్రారంభించారు. దహీని తొలగించే వరకూ పెరుగు ప్యాకెట్లను కొనరాదని హుకుం జారీ చేశారు. పేరు ఏదైనా ప్రజలకు అవసరమైన పెరుగు అందడం ప్రధానం. ప్రజ ల్లో ఆందోళన పెరిగింది. దాంతో ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ దిగివచ్చి దహీ అనే పేరును తొలగిస్తు న్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో హిందీ పట్ల వ్యతిరేకత పరాకాష్టకు చేరిందనడానికి ఇది నిదర్శ నం. పెరుగును దహీ అనడాన్ని వ్యతిరేకించినప్పటికీ పెరుగుతో చేసే ఆవడలను తమిళంలో తైర్‌వడఅని పిలు స్తుంటారు.

తైర్‌ వడ తమిళనాడులోనే కాక,అన్ని భాష ల్లో ప్రాచుర్యం పొందింది.అలాగే, తమిళనాడుకు చెంది న సీనియర్‌ నాయకుడు కామరాజ్‌ నాడర్‌ అవిభక్త కాంగ్రె స్‌ అధ్యక్షునిగా వ్యవరించినప్పుడు తనకు ఎవరైనా అభ్యర్ధన చేసినప్పుడు చూద్దాం అని అనడానికి పార్కలా మ్‌ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు.ఆ విధంగా పార్క్‌ లామ్‌ అనే తమిళ పదం బాగా ప్రాచుర్యా న్ని పొందింది. తమిళులు తమ భాషా, సంస్కృతులకు ఎక్కువ ప్రాధాన్యం, గౌరవం ఇస్తారు. తమిళ భాష ప్రాచీ నమైనదని వాదించడమే కాకుండా అన్ని భాషల కన్నా ముందుగా తమిళ భాషకు ప్రాచీన భాష హోదాని సంపాదించారు. ఆది శంకరాచార్యుల వారి పరంపరలో అన్ని శ్లోకాలు, ప్రార్ధనలు అన్నీ సంస్కృతంలోనే ఉంటా యి. రామానుజుల వారి గ్రంథాలు, తిరుప్పావైవంటి గ్రంథాలు తమిళంలోనే ఉంటాయి. భాషా సంస్కృతుల ను తమిళులు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నా రనడానికి ఇది ఉదాహరణ.తెలుగువారికి ఇలాంటి నియమ నిషేధాలు లేవు. సంస్కృతీ పరంపరను కాపా డు కోవడానికే తెలుగువారు ప్రాధాన్యం ఇస్తారు. పేరు లో ఏమున్నది పెన్నిధి అనే నానుడి తెలుగులో ఉంది. పేరులోనే పెన్నిధి అని తమిళులు భావిస్తారు. తమిళుల ను కలిపి ఉంచుతున్నది హిందీ వ్యతిరేకతే. 1967 వరకూ తమిళనాడులో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. తమిళ భాష, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడతా మన్న వాగ్దానంతో డిఎంకె అధికారంలోకి వస్తున్నాయి. అప్పటి నుంచి డిఎంకె, దాని దాయాది పార్టీ అయిన అన్నా డిఎంకె వంతుల వారీగా అధికారంలోకి వస్తోంది.

ఈ రెండు పార్టీలు ఒకే తానులో ముక్కలే. భాషా, మత, సంస్కృతులపై అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ, అది ఉన్మాదంగా మారితే ఘర్షణలు అనివార్యమ వుతూ ఉంటాయి. మహారాష్ట్రలో మరాఠీ సంస్కృతి, భాషా భిమానాలు మెండుగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల వారు వచ్చి మరాఠీల సంపదను దోచుకుంటున్నారన్న నినాదంపై శివసేన పార్టీ పుట్టింది. ఇంతకీ తమిళులకు హిందీ పట్ల వ్యతిరేకత ఉండవచ్చు కానీ, ఉత్తరాదినుంచి పెరుగు, పాల ఉత్పత్తులను ఇష్టంగా ఆస్వాదిస్తారు. పెరు గు జీర్ణశక్తిని పెంచుతుంది. ఎముకలను గట్టి పరుస్తుంది. పెరుగు కొందరికి పడదు. అటువంటి వారు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.పెరుగులో ఔషధ గుణాలు ఉన్నాయ ని పెద్దలు చెబుతూ ఉంటారు. హిందీ పట్ల వ్యతిరేకత కొద్దీ పెరుగును నిషేధించడం సమంజసం కాదు,ఎవరికి ఇష్టమైన పదార్ధాలను వారు సేవించడం తరతరాలుగా మన సంస్కృతి. పెరుగుకి, భారతీయ సంస్కృతికి అవి నాభావ సంబంధం ఉంది. పౌరాణిక గాధల్లో పెరుగు ను చిలికి తీసిన వెన్నకోసం కృష్ణుడు శైశవ దశలో వెన్న దొంగగా పేరొందిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement