అదానీ వ్యవహారం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంత మాత్రం ఉండదని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ చేసిన ప్రకటన మదుపర్లలో మరింత ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుందా?.. హిండెన్ బర్గ్ నివేది కతో అదానీ షేర్లు కుప్పకూలి ఇన్వెస్టర్లలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్న తరుణంలో అదానీ తమ షేర్ల విలువలను నిలబెట్టడానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలని స్తున్నాయా?… రెండు రోజులుగా నష్టాలను చవి చూసిన మార్కెట్లు కోలుకుంటున్నప్పటికీ … మదుపర్లలో ఆశలు చిగురించడం లేదు. స్టాక్ మార్కెట్ లో పరిస్థితి బుధ వారం నాడు కొంత మేరకు ఆశావహం గా కనిపించింది.
సరిగ్గా ఇదే తరుణంలోనే శక్తికాంత్ దాస్ భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి ఆటు పోట్లను ఎదుర్కోగల స్థితిస్థాప కత్వాన్ని కలిగి ఉందంటూ ప్రకటించారు.మన దేశంలో బ్యాంకు కుంభకోణాలు కొత్త కాదు.అలనాడు ముంద్రా కుంభ కోణం నుంచి హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభ కోణం వరకూ వరుసపెట్టి జాబితా విప్పితే బ్యాంకులను బురిడీ కొట్టించడంలో మన వాణిజ్య వేత్తలు,కార్పొరేట్ ప్రముఖులు ఎంతో ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారనే విషయం స్పష్టం అవుతుంది.అదానీ వ్యవహారం గురిం చి ప్రతిపక్షాలు లేవదీసినప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూటిగా సమాధాన మివ్వకుండా యూపీఏ పదేళ్ల పాలనలో చోటు చేసుకున్న కుంభ కోణాల గురించి ఏకరవు పెట్టడం సమస్యను పక్కదారి పట్టించడమే. అదానీ సంస్థల్లో స్టేట్‌బ్యాంకు,జీవిత భీమా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టడం గురించి అడి గిన ప్రధాని ఏవేవో చెప్పు కుని పోవడం ఎంత వరకు సబబు? మన ఆర్థిక వ్యవస్థ బలొ పేతమైనదన్న శక్తి కాంత్ దాస్ స్పష్టీకరణలో ఆవ గింజంతైనా అసత్యం లేదు. 2008లో అంతర్జాతీ యంగా ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు,కరోనా కాలంలో మన ఆర్థిక వ్య వస్థ ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. పేదవాడికి వంద రూపాయిలు అప్పివ్వ డానికి ఎన్నో ఆంక్షలు పెట్టే బ్యాంకులు కార్పొరేట్ రంగా నికి వేల కోట్ల రూపాయిల రుణాలు ఎలా ఇస్తున్నా యన్న ప్రశ్న ఇలాంటి కుంభకోణాలు బయటపడిన ప్పుడల్లా సామాన్యులను వేధిస్తోంది. పార్టీలు వేరైనా, ప్రభు త్వాలు మారినా ప్రభుత్వాలు పెద్దలకే తప్ప పేదలకు ఏమాత్రం తోడ్పడటం లేదన్నది తిరుగులేని వాస్తవం. ప్రభుత్వ విధానాలు అలా ఉన్నప్పుడు బ్యాంకులు మాత్రం ఏం చేస్తాయి? ప్ర ధాని పేర్కొన్నట్టు యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్,బొగ్గు కుంభకోణాల నిందితులకు ఇప్పటి వరకూ శిక్షలు పడలేదు.అనుమానంపై జైళ్ళలో ఉంచారే తప్ప ఎవరు దోషులో నిగ్గు తేల్చలేదు.
ఇప్పుడు కూడా ఎవరు బాధ్యులో నిగ్గు తేల్చాలని ప్రతిపక్షాలు పట్టు బడుతున్నాయి,ఆ నాటి కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించాలని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ డిమాండ్ చేసినట్టుగానే, ఇప్పు డు అదానీ షేర్ల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చడానికి జేపీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్ల మెంటు ఉభయ సభల్లో గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి ఒక్క అంశాన్ని కూడా చర్చించకుండా సభలు వాయిదా పడుతున్నాయి. ఆనాడు స్పెక్ట్రమ్,బొగ్గు కుంభకోణాల విషయాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేసినప్పుడు ఇదే పరిస్థితినెలకొంది.అంతిమంగా ,ప్రభు త్వాలు మారినా కుంభకోణాలు మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల డిమాండ్లు అరణ్య రోదనగానే మిగిలి పోతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొద్ది రోజుల క్రితం ఇదే మాదిరిగా మన ఆర్థిక వ్యవస్థ పటిష్టత గురించి ప్రకటన చేశారు. బ్యాంకుల్లో కుంభకోణాలను అదుపు చేయడానికి రెగ్యు లేటర్లు ఉన్నాయని ఆమె అన్నారు.సెబీని ఉద్దేశించి ఆమె ఆ ప్రకటన చేసి ఉంటారు.అయితే, అదానీ సెబీని కూడా బురిడీ కొట్టిం చినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఒక్క సెబీ మాత్రమే కాకుండా అంతకుముందు ఉన్న నియం త్రణ సంస్థలు సైతం కుంభకోణాల సూత్రధారుల చేతు ల్లో మోసానికి గురై న సంగతి మనకు తెలుసు.మనీ ల్యాం డరింగ్ పేరిట ఇప్పుడు నమోదు చేస్తున్న కేసుల మాది రిగానే విదేశీ మారకద్రవ్య దుర్వినియోగ చట్టాన్ని ఉల్లం ఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం ఉండేది.కానీ,అధికారంలో ఉన్న నాయకులు ఆ చట్టాన్ని అస్మదీయులకు వర్తింపజేయకుండా కవచంలా కాపాడి న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.ప్రధానమంత్రిపై ప్రతిప క్షాలు నేరుగా దాడి చేయడం కన్నా, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేట్టు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.ప్రజల సొమ్ము వృధా కాకుండా చూడాలి. ఆరోపణలు, ప్రత్యా రోపణల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఈ విష యం దశాబ్దాల చరిత్ర రుజువు చేస్తోంది.కనుక ఇప్ప టికైనా పరిస్థితిలో మార్పు రావాలన్న చిత్తశుద్ధి ఇరు పక్షాలు కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటు న్నారు.ప్రజలకు భరోసా ఇవ్వడం ముఖ్యం.