పలు హిట్ చిత్రాలకు ఎడిటర్ గా పని చేసిన ప్రముఖ సీనియర్ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూశారు. నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. శంకరాభరణం, సాగరసంగమం వంటి దాదాపు రెండు వందలకుపైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన కృష్ణారావు మరణించడంతో టాలీవుడ్‌లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. గుడివాడ ఏఎన్‌ఆర్ కాలేజీలో ఎమ్మెసీ చేసిన జీజీ కృష్ణారావు ఆ తర్వాత మిలటరీలో చేరారు. కానీ సినిమాలపై ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. 1961-62లో ఎడిటింగ్‌లో కోర్స్ చేశారు.ఆ సమయంలోనే దర్శకుడు ఎడిటర్ ఆదుర్తి సుబ్బారావు కంట పడ్డారు. ఆయనతో పరిచయం సినిమాల వైపు నడిపించింది. ఆదుర్తి సుబ్బారావు ప్రోత్సాహంతో చెన్నయ్ వెళ్లిన కృష్ణారావు అక్కడే ప్రాక్టికల్ చేయించారు. రెండు వందలకుపైగా చిత్రాలకు జీజీ కృష్ణారావు ఎడిటర్‌గా పనిచేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement