ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ ఉదయం 11 గంటలకు విచారించనున్నారు. సీఎం కేజ్రీవాల్ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనుండటంతో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ సీఎం కేజ్రీవాల్ ను ఏప్రిల్ నెలలోనే ప్రశ్నించింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈడీ సాక్షాత్తూ సీఎం కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణ వ్యవహారంలో ఏమవుతుందనేది ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది.