హైదరాబాద్ – టీ ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఏఈ, గ్రూప్-1 క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిన ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలు తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది.వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కోసం భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
సిట్ అధికారులు సాక్షిగా పేర్కొన్న శంకరలక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈడీ ఆమెపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.ఈ కేసులో శంకరలక్ష్మితో పాటు కమిషన్‌కు చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు అందజేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ప్రవీణ్, రాజశేఖర్‌ను కస్టడీకి తీసుకొని ఈడీ విచారించునుంది