జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే ఇదే కేసులో ఈనెల 3న సోరెన్‌కు ఈడీ నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరోజున ముందస్తుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొంటూ సీఎం సోరెన్ విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తాఖీదులు ఇచ్చింది. అయితే గత మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement