Saturday, November 23, 2024

జాక్వెలిన్‌కు ఈడీ షాక్‌.. దుబాయ్‌ వెళ్లకుండా అడ్డగింత

ముంబై : జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ దేశం విడిచి దుబాయ్‌ వెళ్తుండగా.. ముంబై ఎయిర్‌ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. రూ.200 కోట్ల ఎక్స్‌టార్షన్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. అంతేగాకుండా.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే.. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌ వెళ్తుండగా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. రూ.200 కోట్ల ఎక్స్‌టార్షన్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్‌ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు సంబంధాలు కలిగి ఉన్నట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు భావిస్తున్నారు. సుఖేష్‌ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కలిసి ఉండగా.. తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement