Saturday, November 23, 2024

పంజాబ్ సీఎం బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థ భారీ షాకిచ్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ సమీప బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. మొహాలీలో ముఖ్యమంత్రి బంధువు భూపిందర్ సింగ్ హనీ నివాసంతోపాటు 10 ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. భూపిందర్ సింగ్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇసుక మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించారు. మైనింగ్ కాంట్రాక్టులను సంపాదించేందుకు నల్లధనాన్ని ఇన్వెస్ట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఎందుకంటే భూపిందర్ పెట్టిన కంపెనీ చాలా చిన్నది.

అంత పెద్ద కాంట్రాక్టులు తీసుకునే స్థాయిలో లేకపోవడమే ఈ అనుమానాలకు నేపథ్యంగా ఉంది. ఇసుక కాంట్రాక్టులు, ఇసుక మాఫియాపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారని ఆప్ సైతం ఆరోపణలు గుప్పిస్తోంది. ఈనేప‌థ్యంలోనే ఈడీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌చారం. అయితే పంజాబ్ రాష్ట్రంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. వచ్చే నెల 20వ తేదీన‌ పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నివాసాల్లో ఈడీ సోదాలు జ‌రుగుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement