Tuesday, November 26, 2024

National : ఈడీ విచార‌ణ‌కు సిద్ధం… కానీ ఒక కండిష‌న్‌…కేజ్రీవాల్‌…

ఢిల్లీ లిక్కర్‌ స్కీం కేసులో డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎనిమిదిసార్లు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. కానీ ఆయన మాత్రం రెగ్యులర్‌గానే విచారణకు డుమ్మా కొడుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదానిపై చర్చ జరుగుతున్న సమయంలో.. సీఎం కేజ్రీవాల్ ఒక ట్విస్ట్ ఇచ్చారు.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరు అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. అయితే.. ఈడీ నోటీసులు చట్ట విరుద్ధంగానే ఉన్నాయని చెబుతూనే విచారణకు రెడీ అని స్పష్టం చేశారు. అయితే.. విచారణ విషయంలో ఆయన ఒక కండీషన్ కూడా పెట్టారు. మార్చి 12 తర్వాత అయితేనే విచారణకు హాజరుఅవుతానని చెప్పారు. ఆ తర్వాత తేదీని ఖరారు చేయాలని చెప్పారు. మార్చి 4న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎనిమిదో సారి నోటీసులకు స్పందించిన ఆయన ఈ విధంగా చెప్పారు. అంతేకాదు.. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ పట్టుబడుతోంది. కానీ.. ఆయన నేరుగా విచారణకు రాబోరు అనీ.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే విచారణకు హాజరు అవుతారని అమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది.

కాగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణ కొనసాగిస్తోంది. లంచాలు చేతులు మారడం, మద్యం పాలసీలో తప్పులతో పాటు తదితర అంశాలపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఇదే కేసులో ఇద్దరు ఆప్‌ సీనియర్ నాయకులు మనీశ్‌ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement