Saturday, November 23, 2024

వీవో ఆఫీసులపై దేశ వ్యాప్తంగా ఈడీ దాడులు.. హైదరాబాద్‌లోనూ సోదాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలోని చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపనీల ప్రధాన కార్యాలయాలపై ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 44 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోందిె. ఇందులో భాగంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2 లోని వివో కార్యాలయంలో ఏడుగురు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒప్పో కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు భాగంగా తాజా సోదాలు జరుగుతున్నాయి.

చైనా కంపనీలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగిన సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఈ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఐటీ, ఈడీ నిఘా పెట్టాయి. చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలపై దాడులు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లోని సంస్థ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement