Saturday, November 23, 2024

TS | ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు.. విచారణకు హాజరు కావాలని ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మరోవైపు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆమెకు శనివారం రిమాండ్ విధించింది. కస్టడీని కూడా ఈడీ అనుమతించింది. ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పొందుపరిచారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి, ప్రధాన సూత్రధారి అని చెబుతున్నారు.

మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. పీఆర్వో రాజేష్‌తో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే వీరి ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అనిల్ వ్యాపార లావాదేవీలపై కూడా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ తెలిపింది. ఈ కేసులో మిగతా నిందితులు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement