లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది. తాజాగా మరోసారి చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ అధికారులు.. తొలిసారిగా నిందితుల జాబితాలో కేజ్రీవాల్ పేరు చేరడం కీలకంగా మారింది. లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది.
అరవింద్ కేజ్రీవాల్‌కి, హవాలా ఆపరేటర్‌లకు మధ్యలో ఛాటింగ్ జరిగిందని, ఆ మెసేజ్‌లన్నీ తమ వద్ద ఉన్నాయని ఈడీ కోర్టుకి వెల్లడించింది. కేజ్రీవాల్ తన మొబైల్ పాస్‌వర్డ్‌లు ఇచ్చేందుకు అంగీకరించలేదని వివరించింది. ఈ కేసులో కీలకంగా భావించే కొన్ని డివైజ్‌లను ధ్వంసం చేశారని, హవాలా ఆపరేటర్స్ వద్ద ఉన్న డివైజ్‌ల నుంచే అన్ని వివరాలూ సేకరిస్తున్నామని ఈడీ తెలిపింది.