Thursday, November 14, 2024

ED | ఫరూఖ్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు..

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, జమ్ము-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీచేసింది. 86 ఏళ్ల ఫరూఖ్‌ ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. జమ్ము-కాశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన కేసులో ఆయనపై మనీలాండరింగ్‌ అభియోగాలు నమోదయ్యాయి. చైర్మన్‌ హోదాలో ఉన్న ఆయన అసోసియేషన్‌ నిధుల్ని తన సొంతఖాతాలకు, ఆఫీస్‌ బేరర్లు సహా మరికొందరి ఖాతాలకు దారిమళ్లించారన్నది ఆరోపణ.

2001-2012 మధ్య కాలంలో జమ్ము-కాశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు బీసీసీఐ రూ.112 కోట్లు ఇచ్చింది. ఈ డబ్బును దారిమళ్లించినట్లు అభియోగాలున్నాయి. దీనిపై 2018లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆఫీస్‌ బేరర్లపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఫరూఖ్‌ పేరును 2022లో చార్జిషీటులో పొందుపరిచారు. ఇదే కేసులో గతనెల విచారణకు రావాలని కోరుతూ ఈడీ సమన్లు జారీచేసింది. అయితే, అనారోగ్య కారణాలను పేర్కొంటూ, విచారణకు హాజరవలేదు. ఈ క్రమంలో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. మంగళవారం శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయానికి రావాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement