లైకా ప్రొడక్షన్స్ లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిని ఎనిమిది లొకేషన్లలో ఉదయం నుంచి అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. చెన్నైలోని డీ నగర్, అడయార్, కరపాక్క తదితర ప్రాంతాల్లోని లైకా కంపెనీకి చెందిన ఎనిమిది చోట్ల దాడులు జరుగుతున్నాయి. దాడుల వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపినట్లుగా సమాచారం. తనిఖీలు పూర్తయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కారణాలు తెలిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. లైకా సంస్థ ఇటీవల పొన్నియన్ సెల్వన్-2 చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించగా.. ఐశ్వర్యరాయ్, విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ, ఐశ్వర్య మీనన్, శోభిత ధూళిపాళ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement