Sunday, November 24, 2024

అరెస్ట్..స‌మ‌న్లు జారీ చేసే అధికారం ఈడీకి ఉంది-సుప్రీంకోర్టు

మ‌నీల్యాండ‌రింగ్ చ‌ట్టం కింద అరెస్ట్ చేసి..స‌మ‌న్లు జారీ చేసే అధికారం ఈడికి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది సుప్రీంకోర్టు. పీఎంఎల్ఏ చ‌ట్టం కింద విచార‌ణ చేప‌ట్టేందుకు, అరెస్టు చేసేందుకు, ప్రాప‌ర్టీని అటాచ్ చేసేందుకు ఈడీకి అన్ని అధికారాలు ఉన్న‌ట్లు సుప్రీం త‌న తీర్పులో తెలిపింది. పీఎంఎల్ఏ కింద ఉన్న అన్ని ఈడీ అధికారాల‌ను సుప్రీం స‌మ‌ర్థించింది. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. ఈడీ, ఎస్ఎఫ్ఐవో, డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ లాంటి ద‌ర్యాప్తు ఏజెన్సీలు పోలీసులు కాదు అని, అందుకే విచార‌ణ స‌మ‌యంలో వాళ్లు సేక‌రించిన ఆధారాలు వాస్త‌వ‌మైన‌వే అని బెంచ్‌ పేర్కొన్న‌ది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అరెస్టు చేస్తున్న వ్య‌క్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో ఈడీ అధికారులు చెప్పాల్సిన అవ‌స‌రం లేదంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement