Friday, November 22, 2024

వెంటాడుతున్న మాంద్యం భయాలు.. వడ్డీ రేట్లు తగ్గకుంటే కష్టమేనంటున్న ఆర్ధికవేత్తలు

అమెరికాలో భారీగా పెరిగిన ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఫెడరల్‌ బ్యాంక్‌ మాత్రం దీనిపై సంతృప్తిగా లేదు. ఇటీల బ్యాంక్‌ జరిపిన సమీక్షలో ధరలను నియంత్రించేందుకు 2023లోనూ కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అంటే ద్రవ్యోల్బణం కట్టడిలో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. నిపుణులు సైతం వడ్డీ రేట్లు తగ్గించకుంటే ఆర్ధిక మాంద్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 2022లో వడ్డీ రేట్లను 7 సార్లు పెంచింది. తాజాగా మరో అర శాతం పెంచి కీలక రేటును 4.25 నుంచి 4.5 శాతానికి చేసింది. 2023లో కీలక వడ్డీ రేట్లు 5 నుంచి 5.5 శాతానికి చేరుస్తామని అంచనా వేసింది. రానున్న రోజుల్లో వినియోగదారులకు, కంపెనీలు, సంస్థలకు రుణాలు మరింత భారంగా కానున్నాయి. 2023లో ఆర్ధిక వృద్ధిరేటు అంచనాను 1.2 శాతం నుంచి 0.5 శాతానికి బ్యాంక్‌ తగ్గించింది. దీనివల్ల మాంద్యం అంచనాలకు అమెరికా సమీపిస్తోంది భాస్తున్నారు. నిరుద్యోగ రేటును ప్రస్తుతం ఉన్న 3.7 శాతం నుంచి వ 2023లో 4.6 శాతానికి పెంచారు.

ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బంది ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరుతో వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని ఆర్ధిక వేత్తలు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు నిదానంగా తగ్గుతాయని, ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. ద్రవ్యోల్బణ భయాన్ని గుర్తించడంలో ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ఆలస్యం చేశారని ఆర్ధిక నిపుణులు విమర్శిస్తున్నారు. 12 నెలల కీలక ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉందని, ఇది ఫెడరల్‌ బ్యాంక్‌ లక్ష్యమైన 2 శాతం కంటే మూడింతలు ఉందని వారు గుర్తు చేస్తున్నారు. 2023 చివరిలో నైనా వడ్డీ రేట్లలో కోత విధిస్తే మార్కెట్‌తో పాటు, ఆర్ధిక వ్యవస్థకు కూడా ప్రోత్సహకరంగా ఉంటుందని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా మార్కెట్‌ అంచనాల కేంటు పెంపు ఎక్కువ ఉంటుందని సంకేతాలించింది. అంటే ఐరోపాలోనూ మందగమనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అమెరికా, ఐరోపాలో ఆర్ధిక మాంద్యం వస్తే దాని ప్రభావం మొత్తం ప్రపంచ దేశాలపై ఉంటుంది. 2023 ప్రధాన ఆర్ధిక వ్యవస్థలు ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుంటే ఇబ్బందులు తప్పవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement