Tuesday, November 5, 2024

పాక్‌లో ధరల సంక్షోభం.. పాలు రూ.210, చికెన్‌ రూ.780

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా పొరుగుదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పాల నుంచి.. చికెన్‌ వరకు అన్ని ధరలు చుక్కలు అంటు తున్నాయి. ప్రస్తుతం అక్కడ లీటరు లూజ్‌ పాల ధరలు రూ.190 నుంచి రూ.210కి ఎగబాకాయి. ఇక లైవ్‌ బ్రాయిలర్‌ చికెన్‌ గత రెండు రోజుల్లో కిలోపై రూ.30-40 పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో చికెన్‌ కిలో రూ.480 రూ.500 మరికొన్ని ప్రాంతాల్లో రూ.780 వరకు పలుకుతున్నట్లు ప్రముఖ వార్తాపత్రిక డాన్‌ నివేదించింది.

కరాచీలో మొన్నటివరకు రూ. 650గా ఉన్న కిలో చికెన్‌ ధరలు ఇప్పుడు రూ.780కి చేరుకుంది. రావల్పిండి, ఇస్లామాబాద్‌ లాంటి కొన్ని నగరాల్లోనూ ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిందని సింధ్‌ పౌల్ట్రి హోల్‌సేలర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కమల్‌ అక్తర్‌ సిద్ధిఖీ చెప్పారు. చికెన్‌ ధరలు పెరగడానికి ఆర్థిక సంక్షోభంతో పాటు ఫీడ్‌ కొరత కారణంగా అనేక పౌల్ట్రి వ్యాపారాలు మూసివేయడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్న ఈ ధరలు చూసి చికెన్‌ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement