Wednesday, November 20, 2024

ఎకో గణేశునికే జై.. గ్రేట‌ర్‌లో మార‌నున్న విధానం..

ప్రభ న్యూస్‌ బ్యూరో, గ్రేటర్‌ హైదరాబాద్‌: ఎకో ఫ్రెండ్లీ గఱేశునికి నగరవాసులు జై కొడుతున్నారు. హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌తో సహా ఏ చెరువులోనూ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌తో రూపొందించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించేది లేదంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి హైకోర్టు ఈ ఆదేశాలను గత సంవత్సరమే ఇచ్చింది. అయితే, అతితక్కువ సమయంలో పీవోపీతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేమని, ఈసారికి అనుమతించాలని రాష్ట్ర ప్రభు త్వ యంత్రాంగం కోరడంతో గత సంవ త్సరం మాత్రమే చివరి నిమిషంలో హైకోర్టు అనుమతించింది. హైదరాబాద్‌ మహా నగరంలో ప్రతి సంవత్సరం కనీసం 3 లక్షలకు పైగా గణశ్‌ మండపా లు పెడుతున్నారు. ఈ విగ్రహాల్లో దాదా పు 90శాతం ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌తోనే తయారీ చేసినవి ఉంటు-న్నాయి. ఈ విగ్రహాలను ట్యాంక్‌బండ్‌తో సహా ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఈ విగ్రహాల తయారీలో ఉపయోగించే జిప్సం, రసాయన కలర్లు నీటిలోని టాక్సిస్‌ స్థాయిలను పెంచడం ద్వారా చేపలతో సహా ఏ ఒక్క జీవాలు కూడా మనుగడ సాధించలేని పరిస్థితి నెలకొంది. ఈ పీవొపీతో విగ్రహాల తయారీని నియం త్రించేందుకు ప్రభుత్వ పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. ఈ విషయంలో హైదరాబాద్‌ మహానగరం లో అతి పెద్దదైన ఖైరతాబాద్‌ గణష్‌ను ఈసారి 50 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించడం ప్రభుత్వ కృషికి తొలి ఫలితమని చెప్పవచ్చు.

ఇదే స్థాయిలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గణష్‌ విగ్రహ తయారీ దార్లను కూడా చైతన్యపర్చడంతో పాటు మట్టి వినాయక విగ్రహాల మార్కెటింగ్‌కు కూడా ప్రోత్సాహం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, బీసీ సంక్షేమ శాఖలు తోడ్పడుతున్నాయి. అయితే, 2022 సెప్టెంబర్‌ మాసం లో జరిగే గణష్‌ నిమజ్జన కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి పీవోపీతో విగ్రహాలు తయా రు చేయకుండా తయారీదారులను చైతన్య పర్చాలని, అదే విధంగా గణష్‌ పండగ నిర్వాహకులకు కూడా అవగాహన, చైతన్యం కల్పించాలని నిర్ణయించారు. దీనికి ప్రతిఫలంగా ఇప్పటికే పలువురు తయారీ దారులు తాము పీవోపీతో కా కుండా మట్టితోనే విగ్రహాలు తయారు చేస్తున్నట్టు ప్రకటించారు. వినాయక ప్రతిమలను ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ ప్రతి మలకన్నా మట్టి వినాయకులను కొనే వారే ఇటీవల ఎక్కువైంది. హైదరాబాద్‌ నగరంలో ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షలకుపైగా వినాయక విగ్రహాల నిమజ్జ నాలు జరుగుతాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ తో తయారు చేసిన విగ్రహాల వల్ల జల కాలుష్యం ఏర్పడుతోందని గతకాలంగా పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ దాదాపు 30 గణశ్‌ నిమజ్జన కొలనులు నిర్మించింది. ఈ ని మజ్జనం కొలనులో గత 2021 సంవత్స రంలో 70వేల గణశ్‌ విగ్రహాల నిమజ్జనం చేశారు. దీంతో నగరంలోని చెరువుల్లో కాలుష్యం తగ్గేందుకు దోహదప డ్డాయి. కాగా గణశ్‌ నిమజ్జనం ముగియ గానే ఒక్క హుస్సేన్‌సాగర్‌ చెరువులో నుండే 5800 టన్నుల పీవోపీ, ఇతర నిమజ్జన వ్యర్థాలను తొలగించారు.

ఈ నిమజ్జన కొలనులు నిర్మాణం బెంగళూ రు తర్వాత కేవలం హైదరా బాద్‌ నగ రంలోనే నిర్మించారు. గత నాలుగేళ్లుగా ఈ కొలనులో స్థానిక చిన్న విగ్రహాల నిమజ్జనం చేస్తూ, స్థానిక చెరు వుల్లో చేయకపోవడం గణనీయంగా కాలుష్య నివారణకు తోడ్పడుతున్నా యి. వీటికి తోడు నగరంలోని ప్రతి మున్సిపల్‌ సర్కిల్‌లో ఉన్న చెరువులు, కుంటల వద్ద అదే విధమైన నిమజ్జన కొలనులు(బేబీ పాండ్స్‌) పెద్దఎత్తున నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్‌ నగరంలో ఒక్క ధూల్‌పేట్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో పీవోపీతో గణష్‌ విగ్రహాల తయారీదారులు ఒక్క రాజస్థాన్‌ రాష్ట్రం నుండే మెజారిటీ తయారీదారులున్నారు. హైదరాబాద్‌ నగరంలో 1975 నుండి గణశ్‌ విగ్రహాల తయారీ పీవోపీతో తయారు చేయడం మొదలైంది. అయితే, ఇన్నేళ్ల నుండి వస్తున్న ఈ తయారీని ఒక్కసారిగా తగ్గించేందుకు కష్ట తరమైనా ఈ ప్రయత్నంలో అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలను ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. దీనికి గణష్‌ ఉత్సవ సమితి కూడా పూర్తిస్థాయిలో సహకరించాలి. గత 2021 సంవత్సరం, కోవిద్‌ మహ మ్మారి భయంవల్ల గణశ్‌ విగ్రహాల ప్రతిష్ట చాలా తక్కువయ్యాయి. ఈ సంవత్సరం ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలోని పలు కాలనీలు, అపార్ట్‌మెంట్లలో ఇప్పటికే మట్టి గణప తులను తయారు చేయడం ప్రారంభ మైంది. ఇళ్లలో కూడా ఈ సంస్కృతి ప్రా రంభమైంది. కాగా, రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఖైరతాబాద్‌ వినాయకుడిని మట్టి తోనే తయారు చేసి, నిమజ్జనం కూడా ప్రతిష్ఠాపన ప్రదేశంలోనే నిమజ్జ నానికి ఏర్పాట్లు చేస్తామని ఖైరతాబాద్ గణేశ్‌ ఉత్సవ కమిటీ గత సంవత్సరమే ప్రకటించింది. దీనికనుగుణంగా ఈసారి మట్టి గణపతి నిర్మాణానికి జూన్‌ 10న కర్రపూజ కూడా నిర్వహించడం శుభపరిణామంగా చెప్పవచ్చు.

- Advertisement -

ఈసారి జీహెచ్‌ఎంసీ ద్వారా మట్టి వినాయకు లు, హెచ్‌ఎండీఏ ద్వారా ఐదు లక్షలు, కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రెండు లక్షల మట్టి విగ్రహాలను తయారు చేసి, హైదరాబాద్‌ నగర పౌరులకు ఉచితంగా పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు సర్కిళ్ల స్థాయిలో ఈ మట్టి విగ్రహాల తయారీని ఇప్పటికే ప్రారంభించారు. హుస్సేన్‌సాగర్‌ను పూర్తిగా శుద్ధి తిరిగి పూర్వ వైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దీనికనుగుణంగా హెచ్‌ఎండీఏ ఆధ్వ ర్యంలో కాలుష్య నివారణ చర్యలను చేపడుతోంది. బాల్కాపూర్‌, కూకట్‌పల్లి నాలాల నుండి వచ్చే కాలుష్య కారక జలాలు హుస్సేన్‌సాగర్‌లో కలవకుండా ఆ నాలాలను దారి మళ్లించింది జీహెచ్‌ ఎంసీ. ఇప్పటికే, గత ఐదారేళ్ల క్రితం హుస్సేన్‌సాగర్‌ వద్ద ఉన్న దుర్వాసనలు ప్రస్తుతం రాకుండా చేయడంలో హెచ్‌ ఎండీఏ చేపట్టిన చర్యలు సత్ఫాలితాలని స్తున్నాయి. ప్రస్తుతం, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌ పరిసర ప్రాంతాల్లో ప్రపం చస్థాయి టూరిజం కేంద్రాలు వస్తున్నా యి. గణష్‌ ఉత్సవాలను కేవలం మతప రంగా కాకుండా హైదరాబాద్‌ నగర సామాజిక, సాంసృతిక ఉత్సవం గానూ, పర్యావరణహితంగానూ జరుపకోవడానికి సమాజంలోని అన్నివర్గాలు ముందుకు రావాల్సి ఉంది. ముఖ్యంగా భాగ్యనగర్‌ ఉత్సవ సమితి, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, మతపె ద్దలు కోర్ట్‌ తీర్పుకనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుంది. దీనివల్ల హైదరాబాద్‌ నగరం మొత్తం దేశానికే ఒక మార్గదర్శనం చూపే విధంగా మారుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement