Sunday, November 17, 2024

EC | హర్యానా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) వాయిదా వేసింది. ఈ మేరకు శనివారం అధికారులు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన తేదీ ప్ర‌కారం అక్టోబర్ 1న జ‌ర‌గాల్సిన ఎన్న‌క‌ల‌ను అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

అయితే అక్టోబర్ 1న జరగనున్న జమ్ముకశ్మీర్‌ ఎన్నికల మూడో దశ పోలింగ్ తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇక‌, జమ్ముకశ్మీర్‌, హర్యానా ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాల తేదీని అక్టోబర్‌ 4 నుంచి అక్టోబర్‌ 8కు మార్పు చేసినట్లు వెల్లడించింది.

శతాబ్దాల నాటి అసోజ్ బిష్ణోయ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు హర్యానాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్ కు తరలివెళ్తారు. దంతో అధిక సంఖ్యలో ప్రజలు తమ హక్కును వినియోగించుకోలేక‌పోతార‌ని… దీని ప్ర‌భావం హర్యానా అసెంబ్లీ ఎన్న‌క‌ల‌పై ప‌డుతుంద‌నే వాదనలతో పోలింగ్ తేదీని, కౌంటింగ్ తేదీని మార్చిన‌ట్టు ఈసీ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement