లోక్ సభ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)గా అధికారికంగా గుర్తించింది. ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది.
శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ తెలిపింది.. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. పార్టీ సింబల్ అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.