ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ సర్కారు ప్రైవేటుపరం చేసిందనీ, భెల్ సంస్థను పారిశ్రామిక మిత్రులకు కట్టబెట్టిందని ఇటీవల మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ ఆరోపణలు చేశారు.
అయితే ప్రియాంకా మోదీపై నిరాధార ఆరోపణలు చేసినట్లు ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆమె చేసినవి తప్పుడు ఆరోపణలు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గురువారం రాత్రి 8 గంటల్లో ఆమె వివరణ ఇవ్వాలంటూ ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.