Sunday, November 24, 2024

Elections | జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. సీఈసీ క్లారిటీ..

లోక్‌సభ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తొలుత ప్రచారం సాగింది. అయితే ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్‌లో ఒకేసారి రెండు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి భద్రత కల్పించడం చాలా ముఖ్యమైన అంశమన్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనా రాజీవ్ కుమార్ స్పందించారు. జమ్మూకాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావించారు. ఈ చట్టం ప్రకారం జమ్మాకాశ్మీర్ లో 107 అసెంబ్లీ స్థానాలున్నాయని తెలిపారు. అందులో 24 స్థానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిషన్ నివేదికలో సీట్ల పరంగా మార్పులున్నాయని తెలిపారు. ఈ అంశంపై స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని డిమాండ్ చేశాయని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. అయితే రాష్ట్రానికి హోదాను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 30, 2024లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement