Monday, November 25, 2024

TS | టీఆర్‌ఎస్‌కు గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించిన ఈసీ

ఐదు రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికలలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు- ఉమ్మడి గుర్తు కేటాయింపునకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిరి మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్‌ఎస్ (తెలంగాణ రాజ్య సమితి) పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ కేటాయించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ మేరకు నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు వర్తింపజేసే ఫారం 10బి అందజేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి గుర్తును కేటాయించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ తరుపున 119 శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తుగా గ్యాస్ సిలిండర్ కేటాయించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం సంతోషం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్యసమితి) నేపథ్యం..

తెలంగాణ రాజ్య సమితి వ్యవస్థాపకుడు తుపాకుల బాలరంగం స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని పొన్నాల. 1983 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే ఉన్నారు. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 2001లో సిద్దిపేట మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. 2006లో సిద్దిపేట మండల జెడ్పీటీసీ సభ్యుడిగా, 2019 నుంచి 2021 వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఈసీకి దరఖాస్తున్న చేసుకున్న బాలరంగం సికింద్రాబాద్ లోని ఓల్డ్ అల్వాల్లో ఉన్న తన ఇంటి చిరునామాను పార్టీ ఆఫీసు అడ్రస్గా పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement