మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కాన్వాయ్ ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కాన్వాయ్‌ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్ మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపేశారు. మెదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు.
మరోవైపు కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ భారీ స్కెచ్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా హుజురాబాద్ కు వెళ్లారు. వెయ్యి వాహనాల కాన్వాయ్ తో ఈటల.. శామీర్ పేట్ నుండి హుజురాబాద్ కు చేరుకుని తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారని సమాచారం.