ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాఆ (శనివారం) లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. కాగా, ఈ పోటీలో శ్రీలంక 5 వికెట్ల తెడాతో నెదర్లాండ్స్ జట్టుపై గెలుపొందింది. నెదర్లాండ్ నిర్ధేశించన 263 పరుగుల లక్షాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే ముగించేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 49.4 ఓవర్లలో 262 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దీంతో శ్రీలంక ముందు 263 పరుగుల టార్గెట్ ని సెట్ చేయగలిగింది.
కాగా, శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక (54), సధీర సమరవిక్రమ (91- నాట్ ఔట్) హాఫ్ సెంచరీలతో మెరవగా. చరిత్ర అసలంక (44), ధనంజయ డి సిల్వా (30 ) పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక నెదర్లాండ్ బౌలర్లలో ఆర్యన్ దత్ 3 తీయగా., పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్మాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక అంతక ముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ బ్యాటర్లలో ఎంగెల్‌బ్రెచ్ట్ (70), బీక్ (59) పరుగులు హాఫ్ సెంచరీలు చేయగా., కోలిన్ అకెర్మాన్ 29 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక.. లంక బౌలర్లలో మధుశంక, కసున్ రజిత చెరో నాలుగు వికెట్లతో సత్తా చాటారు. మహీశ్ తీక్షణకు ఒక వికెట్ దక్కింది.