Tuesday, November 26, 2024

IPL | ఢిల్లీ ముందు ఈజీ టార్గేట్..

పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఐపీఎల్ లో నేడు ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో పోటీప‌డ‌నున్నాయి. ఢిల్లీ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్, హైదరాబాద్ జట్టుకు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కాగా, ఇవ్వాల జరుగుతున్న 38వ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎస్ఆర్ హెచ్ క‌ప్టెన్ మార్క్రామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. కాగా, వార్న‌ర్ కెప్టెన్నీ వ‌హిస్తున్న‌ ఢిల్లీ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేయాల్సి ఉంది.

హైదరాబాద్ టీంలో ఓపెనెర్ అభిషేక్ శర్మ ( 36 బాల్స్ లో 67), హెన్రిచ్ క్లాసెన్ (27 బాల్స్ లో 53 నాట్ అవుట్) మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు.

రెండు జట్లూ ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడాయి. చెరో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 5 మ్యాచ్‌లు ఓడిపోయాయి. దీంతో నాలుగు పాయింట్లతో పాంయిట్స్ టుబుల్ లో 9, 10 స్థానాల్లో నిలిచాయి. అయితే నెట్ రన్ రేట్ తో హైదరాబాద్ ముందు ఉంది. కాగా, ప్లేఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది.

ఈ సీజన్లో రెండు జట్ల మధ్య జరిగిన 34 వ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. స్వల్ప స్కోర్ ను కూడా ఛేదించలేక జట్టు చేతులెత్తేసింది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచి గత మ్యాచ్ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement