భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకుంటున్న యూకే ప్రభుత్వం భారతీయులకు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సులభతరం చేయాలని భావిస్తోంది. భారతీయ పర్యాటకులు,విద్యార్థులు, వృత్తి నిపుణులకు చీప్‌గా, సులభంగా వీసాలు జారీ చేయాలనుకుంటోంది. కాగా ఇండియా- యూకే ఉచిత వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై అధికారిక చర్చలు ప్రారంభమ వనున్న నేపథ్యంలో యూకే అంతర్గత వాణిజ్య సెక్రటరీ అన్నె మారీ ట్రెవెలియన్ జనవరిలోనే భారత్ పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి.
ఈ పర్యటన సమయంలోనే భారతీయ పౌరులకు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించే అవకాశాలున్నాయని ది టైమ్స్ న్యూస్‌పేపర్ రిపోర్ట్ పేర్కొంది. చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలనేది యూకే ప్రభుత్వ టాప్ అజెండాలో భాగంగా ఉందని యూకే వర్గాలు వెల్లడించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital