ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గఢ్‌లో మంగళవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ఎక్కడి వారు అక్కడే నిలబడిపోయారు.
- Advertisement -
భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రకంపనలు ఉదయం 6.43 గంటలకు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.