వరుస భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ను అందోళనకు గురి చేశాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించన కొద్ది సేపటికే మరోసారి భూప్రకంపనలు వచ్చాయి.
దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక ప్రకటన ప్రకారం.. జనవరి 3, 2024న 00:55:55 సమయంలో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8 నమోదైంది. ఇది ఒక మోస్తరు భూకంప సంఘటనను సూచిస్తుంది. భూకంప కేంద్రం 36.90 అక్షాంశం. 71.65 రేఖాంశంలో 140 కి.మీ లోతులో ఉంది.