ఈశాన్య రాష్ట్రాలను వరుసగా భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మిజోరాంలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.7గా భూకంప తీవ్రత నమోదైంది. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ లో భూమి కంపించింది. ఐజ్వాల్ కు కేవలం 31 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉంది.
గతంలో నవంబర్ 29న మిజోరంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని చంభాయ్ జిల్లా సమీపంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ నివేదించింది.