జపానలో భూకంపం సంభవించింది. అర్థరాత్రి సమయంలో సంభవించిన భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.3గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
- Advertisement -
నైరుతి జపాన్ లో ఈ భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఆస్తి, ప్రాణ నష్టం… యువాజిమాకు పశ్చిమాన 18 కిలోమీటర్ల లోతులో క్యుషుషికోకు దీవుల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకూ ఆస్తి, ప్రాణ నష్టాలపై ఎలాంటి సమాచారం మాత్రం లేదు. ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భూకంప తీవ్రతకు బయటకు పరుగులు తీశారు.