Monday, November 25, 2024

Earthquake : జమ్మూకశ్మీరులో భూకంపం..రోడ్లపైకి పరుగులు తీసిన జ‌నం

జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కిష్టావర్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.

మంగళవారం తెల్లవారుజామున 1.10 గంటలకు సంభవించిన భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. కిష్టావర్, లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో ఒకేరోజు భూకంపాలు సంభవించాయి. సంభవించిన భూకంపంతో లేహ్, లడాఖ్ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి బయట రోడ్లపైకి పరుగులు తీశారు. కొత్త సంవత్సర వేడుకల కోసం పర్యాటకులు పెద్ద సంఖ్యలో లేహ్, లడాఖ్ ప్రాంతాలకు తరలివచ్చారు. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement