ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం రిక్టర్‌స్కేలుపై 4.5గా భూకంత తీవ్రతగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. అయితే ఒక్కసారిగా భూమి కంపించడం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement