Monday, November 25, 2024

Pakistan: పాక్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.5గా తీవ్రత నమోదు

పశ్చిమ పాకిస్థాన్‌లో ఇవాళ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూకంపం పాకిస్థాన్‌లో మధ్యాహ్నం 2:57 గంటలకు నమోదైంది. అయితే భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టం గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.

అయితే పాకిస్థాన్‌లో బలమైన భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 17న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. జనవరిలో, పాకిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జనవరిలో, వాతావరణ శాఖ (పిఎమ్‌డి) ప్రకారం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను 6.0 తీవ్రతతో మరో భూకంపం తాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement