ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. ఆదివారం గ్రామీణ హంబోల్ట్ కౌంటీలో సుమారు 1,000 మంది జనాభా కలిగిన పెట్రోలియాకు పశ్చిమాన 108 కిలోమీటర్ల (67 మైళ్ళు) దూరంలో భూమికి 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 5.5 తీవ్రతతో భూమి కంపించిన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదని పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఉత్తర కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement