ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈరోజు ఉదయం భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో శనివారం ఉదయం 5.30 గంటలకు భూకంపం సంభవించింది. కాగా.. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగిన దాఖలాలు లేవు. ఉత్తరకాశీలో కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. పలు ప్రాంతాల్లోని ఇళ్లు కంపించడం జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే భూకంప కేంద్రం ఎక్కడున్నది తెలియలేదు. కాగా.. వారంరోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో భూకంపం రావడం ఇది మూడోసారి.
Advertisement
తాజా వార్తలు
Advertisement