ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయల్లో ఇవ్వాల (సోమవారం) భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్టు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఇవ్వాల సాయంత్రం 6.15 గంటలకు భూమి కంపించిందని, మేఘాలయలోని నార్త్ గ్యారో హిల్స్ వద్ద భూకంప కేంద్రం కేంద్రీక్రుతమై ఉందని అధికారులు వెల్లడించారు. ఇక.. అసోం, మేఘాలయలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనాల్లోనూ కూడా భూమి కంపించినట్లు వార్తలు వచ్చాయి. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement