Friday, November 22, 2024

మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం రావ‌డంతో జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వ‌రుస‌గా మూడు సార్లు భూకంపాలతో ప్రజలకు ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో వణికిపోయారు. మంగళవారం రాత్రి 8.58 గంటలకు 3.4 తీవ్రతతో మొదటిసారి భూకంపం వచ్చింది. అతనంతరం రాత్రి 9.34 గంటలకు మరోసారి, 9.42 గంటలకు మళ్లీ భూమి కంపించింది. ఈ రెండుసార్లు రిక్టర్‌ స్కేలుపై 2.1, 1.9 తీవ్రత నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంపం కేంద్రం నాసిక్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండోరి తాలూకాలో ఉన్నదని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement