మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ మెక్సికో తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు అయింది. తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి.
భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనలు రాగానే జనం భయంతో పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.