మహారాష్ట్రలో స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం ఉదయం 9.16 గంటలకు రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భూ అంతర్భాంగంలో 5 కి.మీ. లోతులో భూపలకలు కదిలాయని తెలిపింది. ఇవాళ ఉదయం మణిపూర్‌లో కూడా భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని ఉక్రుల్‌లో ఉదయం 6.56 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని ఎన్సీఎస్ పేర్కొంది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించిందని పేర్కొంది. అయితే, భూకంపంతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు
Advertisement
తాజా వార్తలు
Advertisement