మహారాష్ట్రలో ఇవాళ భూకంపం సంభవించింది. హింగోలి ప్రాంతంలో ఇవాళ ఉదయం 5:09 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ భూకంపం ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మరోవైపు ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ప్రాణ భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.