ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భూకంపం సంభవించింది. ఈరోజున ఉదయం 06:45 నిమిషాలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.