న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూకశ్మీర్‌లోని దోడాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. కిష్తార్వాకు ఆగ్నేయ దిశలో 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు..
మణిపూర్ లో సైతం 10 సెకన్ల పాటు భూమి కంపించింది..ఇక్కడ 3.2 రిక్టర్ స్కేల్ తీవ్రత నమోదైంది.. ఇప్పటి వరకు ఈ మూడు రాష్ర్టాలలో ఆస్తి ,ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు ..