ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. కిష్ట్‌వార్‌లో భూమి కంపించడంతో దాని తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు. గత 10 రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి అని అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement