ఫిజీలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. సమాచారం ప్రకారం, భూకంపం చాలా బలంగా ఉంది, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు ఈ సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అందించింది. గురువారం అర్థరాత్రి 11.36 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ తెలిపింది..
టోంగా సమీపంలో భారీభూకంపం
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీభూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం టోంగాకు నైరుతి దిశలో 280 కిలోమీటర్ల దూరంలో 104 మైళ్ల లోతులో ఉంది. ఈ భారీ భూకంపం వల్ల అమెరికాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని సునామీ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది. భూకంపం తర్వాత వెస్ట్ కోస్ట్, బ్రిటిష్ కొలంబియా, అలాస్కాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ కూడా తెలిపింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ మొదట ఫిజీ దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత 7గా నివేదించింది