Friday, November 22, 2024

Chinaలో భారీ భూకంపం – 119 మంది మృత్యువాత

చైనాలో గత రాత్రి భారీ భూకంపం నమోదయ్యింది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా రికార్డయ్యింది. తీవ్ర భూకంపం ధాటికి 111 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారని చైనా అధికార మీడియా ‘సీసీటీవీ’ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారని, నేటి ఉదయం నుంచే సహాయక చర్యలు మొదలయ్యాయని వివరించింది. గన్సు ప్రావిన్స్‌లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని, ఇక్కడ సుమారు 100 మంది మరణించినట్టుగా ప్రాంతీయ భూకంప సహాయ కేంద్రం వెల్లడించినట్టు పేర్కొంది. ఇక పొరుగునే ఉన్న కింగ్‌హై ప్రావిన్స్‌లోని హైడాంగ్ నగరంలో భూకంపం ధాటికి 11 మంది మృత్యువాతపడ్డారు. 100 మందికిపైగా గాయాలపాలయ్యారు.

ఈ భూకంపం కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయానని, గణనీయమైన ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లిందని చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రజలు వీధిల్లోకి పరుగులు తీశారని ప్రస్తావించింది. కాగా ఈ ప్రకృతి విపత్తుపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. భూకంప ప్రాంతాల్లో అన్ని విధాల సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలతో బయటపడ్డవారికి సహాయక శిబిరాలు, వారి ఆస్తులకు రక్షణ కూడా కల్పించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement