అసోం, మేఘాలయాలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. మేఘాలయలోని తురాకు ఉత్తరాన 71 కిలోమీటర్ల దూరం, భూమికి 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భారీగా ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. గోప్‌పారాలో రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే నష్టానికి సంబంధించిన నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. రెండు రోజుల కిందట హర్యానా ఝాజ్జర్ ప్రాంతంలో భూకంపం సంభవించగా.. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రభావం కనిపించింది.
ఇది కూడా చదవండి: మినరల్ వాటర్ తాగొచ్చా..?